అహ నా ఆవకాయంట

కోట శ్రీనివాసరావు ఇంటి గుమ్మం ముందు అటూ ఇటూ టెన్షన్‌తో పచార్లు చేస్తున్నాడు. బ్రహ్మానందం విచిత్రంగా

కోటను చూస్తూ కూర్చున్నాడు.

కోట: ఒరేయ్‌! అరగుండు వెధవా! అలా గుడ్ల గూబలా గుడ్లు మెటకరించి చూడకపోతే ఏదైనా ఐడియా చెప్పి చావచ్చుగా.

బ్రహ్మి: అదే ఆలోచిస్తున్నానయ్యా ఏమి తట్టట్లేదు.

కోట: పోయిన సారి అమ్మాయిని చూడడానికి వచ్చిన ఆ పెళ్లి కొడుకు అన్నలు ఘనోధరుడు, వీరబాహుడు జాడీల్లో

ఉన్న ఆవకాయను పీల్చి పిప్పి చేసారు. అంతంత మాత్రంగా ఉన్న ఆ ఆవకాయనే ఆవురావురుమంటూ తిన్నారంటే ఈ సారి ఇంట్లో ఉంది జంధ్యాల వారి ఆవకాయ వారి కన్ను దాని మీద పడిందంటే అంతే సంగతులు. దాని రుచి

మరిగారంటే ఇంట్లోనే తిష్ట వేస్తారు.

బ్రహ్మి: ఇంకా ఆ ఆవకాయ ఎక్కడుందయ్యా? టేస్టుగా ఉందంటూ రోజూ భోజనంలో అదే తిన్నారుగా. ఆ జంధ్యాల వారి పుణ్యమా అని ఇంట్లో వేరే కూర వండితే ఒట్టు. అంతా ఖాళీ చేసి చిన్న జాడీలో సగం మిగిల్చారు. దానికోసమేనా

మహాప్రభో ఈ టెన్షనంతా!

కోట: దాని కోసమేరా అరగుండు వెధవ ఇంకా నెలరోజులు రావాల్సిన ఆవకాయ అర నిమిషంలో ఊది పడేస్తారనే నా భయమంతా. వాళ్ళు వచ్చి అడిగితే ఇంట్లో మంచి నీళ్ళు తప్ప మరేమిలేవని చెప్పు.

బ్రహ్మి (మనసులో): ఒరేయ్‌! అంట్ల వెధవ ఇంటికి వచ్చిన అతిథికి కనీసం పచ్చడి మెతుకులు కూడా పెట్టడానికి ఏడుస్తున్నావ్‌ గడ్డి తిన్న గబ్బిలంలా ఆ మొహం చూడు పోతావొరేయ్‌! నాశనమైపోతావు.

( ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులోంచి పెళ్లికొడుకుతో పాటు ఘనోధరుడు, వీరబాహుడు దిగి

కోట దగ్గరికి వస్తారు. వారి చేతిలో ఏవో సంచులు ఉంటాయి)

కోట: రండి, రండి మీకోసమే ఎదురుచూస్తున్నాను. ఇంతకీ మీ చేతుల్లో ఆ సంచులేంటి?

పెళ్ళికొడుకు: ఆ….! ఏం లేదండి పోయినసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు మీ ఇంట్లో ఆవకాయ తిన్నారుగా

అది వాళ్ళకు పెద్దగా నచ్చలేదంటా. అందుకే మీ కోసం జంధ్యాల వారి ఆవకాయ ప్యాకెట్లు సంచి నిండా తీసుకువచ్చారు.

కోట: అలాగా….! చాలా సంతోషం వీధిలోనే నిలబడుతారే లోపలికి రండి.

బ్రహ్మి (మనసులో): అదృష్టం అంటే నీదేరా. ఆవకాయే నీ ఇంటికి వచ్చింది. ఇంక ఈ సంవత్సరమంతా పండగ చేస్కో.