ఎప్పుడూ రాజునే

హాయ్‌ అండీ! నా పేరు మామిడి. పండ్లలో అందరూ నన్నే రాజు అంటారు. పండిన తర్వాత సంగతి వదిలేయండి. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం పుల్లగా ఉన్నానని నన్ను వెక్కిరిస్తారు కదా! కాని పుల్లగా ఉన్నందుకే నాతో రకరకాల పచ్చళ్లు చేయొచ్చు గుర్తుపెట్టుకోండి.

ఆవకాయ, అల్లం ఆవకాయ, మాగాయ, బెల్లం మాగాయ అబ్బో నాతో ఎన్ని రకాల పచ్చళ్లు చేసి లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఆ రుచెందుకు వచ్చిందనుకున్నారు. నేను పుల్లగా ఉండడం వల్లే. అర్ధమయ్యిందా? మరి ఈ సారి నన్ను పుల్లగా ఉన్నానని తక్కువ చేస్తే మాత్రం ఊరుకోను. అసలు విషయం మరిచిపోయాను ఈ మధ్య జంధ్యాల వారి ఇంటికి అతిథిగా వెళ్ళాను. అబ్బో వారి మర్యాదలే మర్యాదలు.

నాతో అద్భుతమైన పచ్చళ్ళు చేసి అతిథులకు వడ్డిస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఆ పచ్చళ్ళు రుచి చూడండి. నా మాటగా చెప్తున్నాను.

సీజన్‌ అయిపోయిందిగా ఇక నేను వెళ్ళొస్తాను. ఆ….ఆ…. బాధపడకండి జంధ్యాల పచ్చళ్ళ రూపంలో  మీ

ఇంట్లోనే ఉంటానుగా మరి.

ఇక ఉంటాను బై..బై…. మళ్ళీ కలుసుకుందాం.